త్వరలో అల్లరి నరేష్ వివాహం

 

ప్రముఖ హాస్య నటుడు అల్లరి నరేష్ త్వరలో చెన్నై కి చెందిన విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 3వ తేదీన చెన్నైలో వారి నిశ్చితార్దం అవుతుందని సమాచారం. విరూప తల్లి తండ్రులు కృష్ణా జిల్లాకు చెందిన వారు కానీ చెన్నై లో స్థిరపడ్డారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత విరూప చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఒకటి రెండు నెలలనే వారి వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లరి నరేష్ సాయి కిషోర్ దర్శకత్వంలో ‘జేమ్స్ బాండ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘నేను కాదు నా పెళ్ళాం’ అనే ట్యాగ్ లైన్ పెట్టేరు. ఈ సినిమాలో సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu