తిరుపతిలో వైసీపీ దౌర్జన్యాలు నాన్‌స్టాప్!
posted on May 13, 2024 4:41PM
పుణ్యక్షేత్ర సమీపంలో కూడా వైసీపీ నేతలు పాపపు పనులు మానుకోవడం లేదు. తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ నాయకులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు. తిరుపతి 13వ వార్డులోని 141, 142, 143 బూత్‌లలో దొంగ ఓట్లు వేసే ప్రయత్నాలు జరిగాయి. స్థానిక వైసీపీ కార్పొరేటర్ తన మనుషుల్ని పిలిపించి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేసినప్పుడు గుర్తించిన టీడీపీ, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వంద మందికి పైగా వైసీపీ గూండాలు దాడి చేశారు. కత్తులు చూపించి చంపుతామని బెదిరించారు. అక్కడే వున్న పోలీసులు ఎంతమాత్రం స్పందించకుండా ఈగలు తోలుకుంటూ నిల్చున్నారు. తిరుపతిలో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని టీడీపీ, జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.