తిరుమల వైకుంఠద్వార దర్శనాలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠద్వార దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం (జనవరి 14) సంక్రాంతి పర్వదినాన శ్రీవారిని మొత్తం 78 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వారిలో 17వేల 406 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 44 లక్షల రూపాయలు వచ్చింది.

ఇలా ఉండగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు 16వ తేదీ కోటా పూర్తయ్యింది. 17వ తేదీ కోటా టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. తిరుపతిలో విష్ణఉ నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో ఈ టోకెన్లు జారీ చేశారు.