ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్
posted on Dec 29, 2025 8:26PM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు ఎన్నిక రద్దు చేయాలని కోర్టును కోరారు.. తనపై ఉన్న 7 క్రిమినల్ కేసులను నవీన్ యాదవ్ వెల్లడించలేదని పేర్కొన్నాది. ప్రచారంలోనూ నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రి పరిశీలనలో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ .. 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ (నవీన్ యాదవ్)కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ (మాగంటి సునీత) 74,259 ఓట్లు, బీజేపీ (దీపక్ రెడ్డి)కు 17,061 ఓట్లు వచ్చాయి.