భార్యభర్తల మద్య ఎమోషన్ దూరాన్ని తగ్గించే చిట్కాలు..!
posted on Nov 26, 2025 2:40PM

ఎమోషన్స్ అనేవి మాటలకు అందని చర్యలు. మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు. ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది. కానీ ఎమోషన్ అటాచ్మెంట్ తగ్గితే ఆ బంధాలు స్పాయిల్ అయ్యే దిశగా వెళతాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ఎమోషన్స్ అనేవి ఇద్దరినీ కలిసి ఉండేలా చేస్తాయి. కానీ ఇప్పటికాలం వేగవంతమైన ప్రపంచంలో కెరీర్ పరంగా ఉండే హడావిడి, సోషల్ మీడియా, ఒత్తిడులు, ఇతరుల జోక్యం.. ఇట్లా ఏదైనా కావచ్చు. మనుషులను ఒక్కసారిగా బంధం నుండి విడదీయకుండా నెమ్మదిగా బంధం మసకబారిపోయేలా చేస్తాయి. భార్యాభర్తల మధ్య సాధారణంగానే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కానీ ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది ఒక్కరోజులో ఏర్పడదు, అలాగే ఒకేరోజుతో తెగిపోదు. కాకపోతే భార్యాభర్తల మధ్య ఎమోషన్ బాండింగ్ లో దూరాన్ని తగ్గించడం కష్టమేమి కాదు. కొన్ని చిన్న చిట్కాల ద్వారా భార్యాభర్తల మధ్య ఎమోషన్ దూరాన్ని తగ్గించి తిరిగి బంధం బలంగా మారేలా చేయవచ్చు. దీనికోసం సహాయపడే చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
నాణ్యమైన సమయం..
నేటికాలంలో ఎప్పుడూ ఫోన్ పట్టుకుని ఉండటం అందరికీ అలవాటు. కానీ ఇలా పోన్ ను చూస్తుండటం వల్ల కనీసం లైప్ పార్ట్నర్ ముఖాన్ని సరిగా చూసి మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే లైఫ్ పార్ట్నర్ తో ఉన్నప్పుడు నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఫోన్ తో సహా అన్నింటిని పక్కన పెట్టి ఇద్దరూ విలువైన సమయాన్ని గడపగలిగితే వారి మధ్య దూరం తగ్గుతుంది.
ఓపెన్ గా..
ఎమోషన్స్ ను మనసులోనే దాచుకుంటే అవి ఎవ్వరికీ, ఎప్పటికీ అర్థం కావు. కాబట్టి ఎమోషన్స్ ఏవైనా సరే ఓపెన్ గా బయటకు చెప్పగలిగితే అప్పుడే అవి ఎదుటి వ్యక్తికి అర్థం అవుతాయి. మనసులో ఉండే విషయం ఏదైనా ఓపెన్ గా తనతో చెప్పుకోగలుగుతారు అనే ఒక నమ్మకం భాగస్వామికి కలిగితే ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్ దూరం తగ్గి ఇద్దరూ మానసికంగా దగ్గరవుతారు.
ప్రేమ.. ప్రకటన..
అందరూ ప్రేమను ఒకేలా వ్యక్తం చేయలేరు.. ఇది చాలామంది చెప్పే డైలాగ్.. కానీ ఒకే రకంగా వ్యక్తం చేయలేకపోయినా కనీసం తమకు చేతనైన విధంగా అయినా ప్రేమను వ్యక్తం చేస్తేనే ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలంగా మారుతుంది. అందుకే రోజులో ఏదో ఒక సందర్బంలో ఏదో ఒక విధంగా ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నించాలి.
గొడవ.. అవగాహన..
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. మరీ ముఖ్యంగా ఇద్దరూ ఒకరినొకరు నిందించుకుంటూ, తప్పులు ఎత్తి చూపుకుంటూ గొడవ పడుతుంటారు. కానీ గొడవ పడటం కంటే ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వస్తోంది, దానికి కారణం ఏంటి? గొడవలు రాకుండా ఉండటానికి ఏం చేయాలని ఆలోచిస్తే ఇద్దరి మధ్య గొడవలు తగ్గి ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. దూరం తగ్గుతుంది.
శారీరకంగా.. మానసికంగా..
కొందరు బార్యాభర్తలను చూస్తే వారు కేవలం శారీరక బందం కోసం బార్యాభర్తలుగా ఉంటారు. కానీ భార్యాభర్తల బంధం అనేది కేవలం శారీరక బందమే కాదు.. మానసిక బంధం కూడా. మానసికంగా ఇద్దరూ ఒక్కటిగా ఉన్నప్పుడు శారీరక బంధం వారిని మరింత దగ్గర చేస్తుంది. అంతే కానీ మానసికంగా ఎలా ఉన్నా శారీరకంగా ఒకటిగా ఉంటే సరిపోతుంది అనుకోవడం భ్రమ.
నియమాలు.. షేరింగ్..
చాలామంది బార్యాభర్తలు ఒకరికి ఒకరు నియమాలు విధిస్తుంటారు. నిజానికి ఇలా నియమాల మీద ఎదిగేది కాదు భార్యాభర్తల బందం అంటే. బార్యాభర్తల బంధం ఎప్పుడూ ఒకరితో ఒకరు ఎలా ఉంటున్నారు, ఒకరికోసం ఒకరు ఎలా సమయాన్ని గడుపుతారు, ఇద్దరూ కలిసి ఎలా టైం లీడ్ చేసుకుంటారు అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది బంధాన్ని స్థిరంగా ఉంచుతుంది. బంధానికి భద్రతను ఇస్తుంది.
*రూపశ్రీ.