దొంగలు బాబోయ్ దొంగలు...

 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం నాడు దొంగలు చెలరేగిపోయారు. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ ఖాతాదారుడు 9 లక్షలు డ్రా చేసుకుని బయటకి వచ్చాడు. తనస్కూటర్ డిక్కీలో డబ్బు పెట్టుకున్న తర్వాత చూస్తే స్కూటర్ టైర్‌కి పంక్చర్ పడి వుంది. స్కూటర్‌ని నెట్టుకుంటూ వెళ్ళి పంక్చర్ వేయిస్తూ వుండగా దొంగలు అతని కన్నుగప్పి డిక్కీలో వున్న 9 లక్షలను దోచుకుపోయారు.

 

అలాగే హైదరాబాద్‌లోని బేగం బజారులో ఆటోలో వెళ్తున్న వ్యాపారులపై దాడి చేసి వారి వద్ద నుంచి 2 కేజీల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పోయారు.

 

తెనాలి చెంచుపేటలో ఒక వ్యక్తి బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలను డ్రా చేసుకుని వస్తుండగా, దొంగలు ఆ వ్యక్తి చేతిలోంచి సంచిని లాక్కుని పారిపోయారు.

 

అనంతపురం జిల్లాలోని లోని ఓ దేవాలయంలో దొంగలు పడి హుండీలోని డబ్బుతోపాటు 20 లక్షల విలువైన నగలు, వెండి సామానును దోచుకుని పోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu