చంద్రబాబు కమాల్ 'కియా'.. మరి, జగనన్న ఏం కియా?

ఎల‌న్ మ‌స్క్‌. టెస్లా, స్పేస్ ఎక్స్‌ ఓన‌ర్‌. టెస్లా ఎల‌క్ట్రిక్ కార్లు అంటే వాల్డ్ వైడ్‌గా య‌మా క్రేజ్‌. అందుకే, ఇండియ‌న్స్ ఎప్పుడెప్పుడు టెస్లా కార్లు దేశంలో ఎంట్రీ ఇస్తాయాన‌ని తెగ ఎదురుచూస్తున్నారు. కేటీఆర్ సైతం ఆ మ‌ధ్య విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు టెస్లా కారు న‌డిపి తెగ మురిసిపోయారు. లేటెస్ట్‌గా.. భార‌త్‌లో టెస్లా కార్ ఎంట్రీపై ఎల‌న్ మ‌స్క్‌కు ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్‌కు మ‌ధ్య చిన్న‌పాటి వార్ న‌డుస్తోంది. అది ముదిరి సోష‌ల్ మీడియాలో బ్లేమ్ గేమ్ మొద‌లైంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఎంట‌ర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. టెస్లాకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు మీతో కలిసి పనిచేయడానికి సంతోషిస్తామంటూ ట్వీట్ చేశారు. ప‌నిలో ప‌నిగా తెలంగాణ పెట్టుబ‌డుల కేంద్ర‌మ‌ని చెబుతూ రాష్ట్రానికి ఆహ్వానించారు కూడా. ఈ ఒక్క ట్వీట్‌తో అబ్బో కేటీఆర్ ఎంత‌బాగా ప‌ని చేస్తున్నారంటూ ఫుల్ ప‌బ్లిసిటీ కొట్టేశారు. అయితే, ఇదంతా ఓవ‌రాక్ష‌న్ అనేవాళ్లూ లేక‌పోలేదు. 

ఇదంతా స‌రే.. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర ఓకే.. మ‌రి, మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంగ‌తేంటి? జ‌గ‌న‌న్న ఏం చేస్తున్న‌ట్టు? ఆయ‌న గ‌ద్దె నెక్కాక ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌టంటే ఒక్క కంపెనీ అయినా వ‌చ్చిందా?  కొత్త‌వి రాక‌పోగా.. ఉన్న‌వి వెళ్లిపోయాయి కూడా. గ‌తంలో స‌న్‌రైజ్ స్టేట్ అంటూ.. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని విదేశాల‌కు తిరిగి.. పెట్టుబ‌డులు తీసుకొస్తే.. ఇప్పుడు జ‌గ‌న‌న్న మాత్రం వ‌చ్చిన వాటిని వెళ్ల‌గొట్టే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ప‌క్క రాష్ట్ర మంత్రి కేటీఆర్ అంత చొర‌వ తీసుకొని.. నేరుగా టెస్లాను తెలంగాణ‌కు ఆహ్వానిస్తే.. ఇప్ప‌టికే చంద్ర‌బాబు తీసుకొచ్చిన కియా మోట‌ర్స్ మా రాష్ట్రంలోనే ఉంది.. టెస్లా సైతం ఏపీలో కంపెనీ పెడితే బాగుంటుంద‌ని వెల్‌క‌మ్ చెప్ప‌లేరా? క‌నీసం వారిలా ఓ ట్వీట్ కూడా చేయ‌లేరా?  పోయేదేముందు డ్యూడ్‌.. మా అంటే టెస్లా వ‌స్తుంది.. లేదంటే ఫుల్ ప‌బ్లిసిటీ అయినా వ‌స్తుంది.. ఆ మాత్రం ప‌ని కూడా చేయ‌లేరా జ‌గ‌న‌న్నా.. అంటూ ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. మాకెక్క‌డి ముఖ్య‌మంత్రి దొరికాడురా బాబోయ్ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అదే సీఎంగా చంద్ర‌బాబు ఉంటేనా.... అని కియా కంపెనీ ఏపీకి తీసుకొచ్చిన‌ సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు.