దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ సూత్రధారి మృతి
posted on Jul 26, 2024 2:12PM
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మరణించాడు. చర్లపల్లి జైలులో వున్న మక్బూల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి నెల క్రితం గుండె ఆపరేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మూత్రపిండాలు కూడా విఫలం కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుళ్ళలో మక్బూల్ హస్తం వున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ కేసులో మక్బూల్‌కి ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఆరు నెలల క్రితం మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారంట్ మీద హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. 21 ఫిబ్రవరి, 2013న దిల్‌సుఖ్‌నగర్‌లో రద్దీగా వుండే ప్రాంతంలో మక్బూల్ బాంబులు పేల్చాడు. ఆ పేలుళ్ళలో 17 మంది మరణించారు.