కమలా.. కుమ్మేయ్!
posted on Jul 26, 2024 3:18PM
అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరు ఖరారు అయ్యే దశలో వున్న నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా నుంచి ఆమెకు మద్దతు లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరు ముందుకు వచ్చింది. అయితే బరాక్ ఒబామా మొదటి నుంచి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తన భార్య మిచెల్ ఒబామాను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా బరిలోకి దించడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే డెమోక్రటిక్ పార్టీలో కమలా హ్యారిస్‌కే ఎక్కువ మద్దతు లభిస్తూ వుండటంతో ఒబామా ఫ్యామిలీకి కూడా కమలా హ్యారీస్‌కి మద్దతు ప్రకటించక తప్పలేదు.