దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది...

 

ఒకపక్క సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాలకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగొచ్చని.. మెట్రో నగరాలైన దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మెట్రో నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక అప్రమత్తమైన హైదరాబాద్‌ పోలీసులు నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu