రాయచోటిలో తెలుగుదేశం పాగా వేసేనా?
posted on Feb 22, 2024 2:12PM
రాయచోటి... ఆంధ్రప్రదేశ్ లో హాట్‌సీట్. ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ఉంది. శ్రీకాంత్‌రెడ్డికి దీటైన ప్రత్యర్థిని వెతికే పనిలో నిమగ్నమైంది. ముస్లింలు, అలాగే బలిజ ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉండే రాయచోటిలో ఎవరిని పోటీకి దింపాలన్న విషయంపై తెలుగుదేశం అధిష్టానం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జితో పాటుగా మరి కొందరి పేర్లనూ పరిశీలిస్తోంది. ఇన్నాళ్లు వార్ వన్‌సైడ్ అన్నట్లు రాజకీయం నడిచిన రాయచోటిలో ఈ సారి కనిపించబోయే సీనేంటి? శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
రాయచోటు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 275 పోలింగ్ బూతులు ఉన్నాయి. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 70.05శాతం ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో వైసీపీకి 56.95శాతం, తెలుగుదేశం పార్టీకి 38.04 శాతం ఓట్లు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల విషయానికి వస్తే గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు వరుసా గెలిచారు. ఇప్పుడైతే నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో 80 వేలకు పైగా ముస్లిం మైనారిటీల ఓట్లో ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. రాయచోటి లోని తూర్పు ప్రాంతంలోనే ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండటంతో ఈ ప్రాంత ఓట్లే నియోజకవర్గంలో గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు అంటున్నారు. ఇక ఈ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గం వారిలో ఎక్కువ మంది బీజేపీకే మద్దతుగా నిలుస్తారనీ, బీజేపీ అభ్యర్థి బలంగా లేకుంటే ఓటింగ్ కు గైర్హాజరయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.
ఈ సారి నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే ముస్లిం మైనారిటీ అభ్యర్థినే రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నప్పటికీ నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీకి దింపాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ముస్లిం మైనారిటీ నుంచి పోటీకి దిగాలనుకుంటున్న వారు తెలుగుదేశం వైపు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ముస్లిం మైనారిటీలే అత్యధికంగా ఉన్నప్పటికీ రాయచోటిలో గడికోట్ల, రెడ్డప్ప కుటుంబాలే ఆధపత్యం వహిస్తూ వస్తున్నాయి.ఇలా ఉండగా రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎదిరించి విజయం సాధించడం అంత తేలికైన పని కాదని భావిస్తున్న తెలుగుదేశం ఇక్కడ పోటీకి పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. ప్రస్తతానికైతే రాయచోటి నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు రేసులో ఉన్నారు. వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ముస్తాఖ్ హుస్సేన్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి , గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించి ఏడాది కిందటే తెలుగుదేశం గూటికి చేరిన పీసీసీ మాజీ సభ్యుడు రాంప్రసాద్ రెడ్డి, అలాగే రెండు నెలల కిందటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ద్వారకానాథ్‌రెడ్డి ఉన్నారు. దివంగత తారకరత్న భార్య ద్వారకానాథ్ రెడ్డికి మేనకోడలు. తెలుగుదేశం పార్టీలోకి అసెంబ్లీ టికెట్ ఆశించే వచ్చానని ద్వారకానాథ్ రెడ్డి దాపరికం లేకుండా చెబుతున్నారు. ఒక వేళ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి టికెట్ లభించకుంటే తన దారి తాను చూసుకుంటానని ద్వరకానాథ్ రెడ్డి తన అనుచరులతో ఓపెన్ గానే చెప్పేస్తున్నారని వినికిడి.
ఒకప్పుడు రాయచోటి ఉమ్మడి కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది.
ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే అని చెప్పుకోవచ్చు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది. తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా.. అసెంబ్లీలో సమర్థంగా తన వాణి వినిపించిన శ్రీకాంత్‌రెడ్డి.. వైఎస్ మరణం తర్వాత జగన్‌తోనే నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వైసీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్‌రెడ్డి. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
రాయచోటి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 31 వేల 637 ఓట్లు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ 95 వేల పైచిలుకు ఓట్లు సాధించింది వైసీపీ. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మళ్లీ గడికోట శ్రీకాంత్‌రెడ్డే పోటీ చేయనున్నారని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అధిష్టానంలో పట్టుతోపాటు.. జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల శ్రీకాంత్‌రెడ్డి స్థానం సుస్థిరమేనని అంటున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే రాయచోటి టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఇక్కడ నుంచి ఓటమి చవి చూసిన
ఈ సీటుపై టీడీపీలో తీవ్ర పోటీ ఉంది. ఇప్పటికే రెండుసార్లు పోటీచేసి ఓటమి చవిచూసిన రమేశ్‌కుమార్‌రెడ్డి మళ్లీ మరోమారు పోటీకి రెడీ అవుతున్నారు. ఇక రమేష్ కుమార్ రెడ్డి, ప్రసాద్ బాబుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అలాగే రామప్రసాద్ రెడ్డి కూడా పార్టీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రమేశ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌బాబుల మధ్య గ్రూప్‌వార్ నడుస్తోంది.
మొత్తంగా చూస్తే రాయచోటిలో గెలవాలంటే మైనార్టీల సమద్దతే కీలకం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధిష్టానం ఏం చేయబోతోందనేదే హాట్ టాపిక్‌గా మారింది. రాయచోటి అసెంబ్లీకి పోటీ చేయాల పలువురు ముస్లిం మైనారిటీ కి చెందిన వారు కోరుకుంటున్నారు.రు. ఏదైనప్పటికి టిడిపి టికెట్ ముస్లిం మైనారిటీలకు ఇస్తారా లేక రాంప్రసాద్‌రెడ్డి కే ఫైనల్ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.