ప్రపంచ చెస్ చాంపియన్ గా తెలుగు తేజం గుకేశ్
posted on Dec 13, 2024 11:29AM
ప్రపంచ చెస్ చాంపియన్ గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు నిలిచాడు. చైనాకు చెందిన డింగ్ లిరైన్ పై గుకేశ్ గెలిచాడు. తిరుపతి సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ గ్రామానికి చెందిన గుకేష్ 2006లో ఈ ఎన్ టి సర్జన్ డాక్టర్ రజనీకాంత్, మైక్రోబయాలజిస్ట్ పద్మ దంపతులకు జన్మించాడు. చెస్ పట్ల ఆసక్తితో చిన్న వయసులోనే అంటే 12 ఏళ్లకే గుకేశ్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు మన భారత దేశం నుంచి ఇప్పటి వరకు చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ ఉన్నాడు. ఆయన తర్వాత గుకేశ్ ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. గుకేశ్ కుటుంబం చెన్నయ్ లో స్థిర పడింది. గుకేశ్ ప్రపంచ చెస్ చాంపియన్ రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు అభినందనలు తెలిపారు.