అల్లు అర్జున్ అరెస్ట్
posted on Dec 13, 2024 12:02PM
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 ప్రీమియం షో రిలీజ్ చేసిన రోజే సంధ్య థియేటర్ కు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు చేరుకున్నారు. వేలాది మంది అభిమానులు ఉన్న సమయంలో అల్లు అర్జున్ తన కారులో బౌన్సర్లతో రావడంతోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట జరిగిన రోజే రేవతి కొడుకు కూడా తొక్కిసలాటలో ప్రాణాపాయస్థితిలో చేరుకున్నాడు. రేవతి చనిపోయినందకు ఇప్పటికే అల్లు అర్జున్ 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాడు. ఈ కేసులో సంధ్య థియేటర్ మేనేజర్ ఎ1 అయితే అల్లు అర్జున్ ఎ 2గా ఉన్నారు.తాను ముందుగానే ప్రకటించి థియేటర్ కు చేరుకున్నట్లు అల్లు అర్జున్ చెబుతుండగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ఈ కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.