టాలీవుడ్ విరాళం రూ.11,51,56,116

 

హూద్ హూద్ తుఫాను బాధితుల సహాయం కోసం ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆదివారం ఉదయం 10 నుండి రాత్రి 10వరకు హైదరాబాద్ లో నిర్వహించిన వివిధ వినోద, క్రీడా కార్యక్రమాలు ఆద్యంతం చాలా హుషారుగా సాగాయి. తెలుగు సినీ పరిశ్రమ యావత్తు ఇందులో పాల్గొనేందుకు కదిలిరావడంతో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. సినీ పరిశ్రమ 12గంటల పాటు ఏకధాటిగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా వసూలయిన రూ.11,51,56,116 లను, చివరిగా ఈ కార్యక్రమానికి హాజరయిన ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు రూపంలో అందజేశారు.

 

జెమినీ టీవి. రూ.3.50 కోట్లు, మేము సైతం వెబ్ సైటుకి ప్రజలు మరియు అభిమానులు పంపిన విరాళాలు రూ.20లక్షలు, బాలకృష్ణ అభిమాన సంఘం రూ.1,11,111, హిందూపురం నియోజక వర్గం ప్రజలు రూ.43 లక్షలు, బిగ్ సి సంస్థ వారు రూ.15లక్షలు, ఆశ్రా ఫౌండేషన్ రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు.