కేసీఆర్ నుంచి ప్రాణహాని..భద్రత కల్పించండి:హైకోర్టులో రేవంత్ పిటిషన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలంటూ కొడంగల్ ఎమ్మెల్యే, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరగా..స్పందించిన ప్రభుత్వం వారం రోజులు గడువు కావాలని కోరింది. అయితే రేవంత్ రెడ్డికి రక్షణ కల్పించడానికి ఉన్న అడ్డంకులేమిటో తెలియజేయాలని కేంద్రప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu