ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణం
posted on Dec 16, 2014 10:52AM

తెలంగాణ కేబినెట్‌లోకి ఆరుగురు కొత్త మంత్రులు చేరారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆరుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి రాజ్‌భవన్‌కి వెళ్ళే దారిలో హడావిడి, టీఆర్ఎస్ పతాకాల రెపరెపలు కనిపించాయి.