భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ!

తెలంగాణ ప్రభుత్వంఒకే సారి 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కాణంగా నిలిపివేసిన జీవోను తెలంగాణ ప్రభుత్వం సోమవారం (జులై 8)  విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం వివిధ  కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైనవారు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.  రేవంత్ సర్కార్ తాజాగా నియమించిన కార్పొరేషన్ల చైర్మన్ల జాబితా ఇలా ఉంది. 

హౌసింగ్ కార్పొరేషన్ - ఆర్. గురునాథ్ రెడ్డి,  ఆర్యవైశ్య కార్పొరేషన్ - కాల్ప సుజాత,  గ్రంథాలయ పరిషత్ - ఎండీ రియాజ్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ - పోడెం వీరయ్య, స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ - ఎన్. గిరిధర్ రెడ్డి,  మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్ - జనక్ ప్రసాద్.

ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. విజయబాబు, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ - చల్లా నరసింహారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - కె. నరేందర్ రెడ్డి,  కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - ఇ. వెంకట్రామిరెడ్డి,  హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ - నాయుడు సత్యనారాయణ,  మైనారిటీస్ కార్పొరేషన్ - ఎం.ఏ. జబ్బార్,  రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - రాంరెడ్డి మల్ రెడ్డి,  మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - అనిల్ ఎరావత్,  ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ - ఐతా ప్రకాశ్ రెడ్డి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ - నిర్మల జగ్గారెడ్డి (జగ్గారెడ్డి సతీమణి).

 బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ - నూతి శ్రీకాంత్,  రాష్ట్ర సాంకేతిక సేవల అభివృద్ధి కార్పొరేషన్ - మన్నె సతీశ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ - ఎన్. ప్రీతమ్,  షెడ్యూల్డ్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బెల్లయ్య నాయక్,  గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - కె. తిరుపతి,  మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - జె. జైపాల్,  టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ - పటేల్ రమేశ్ రెడ్డి,  ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - బంద్రు శోభారాణి,  ఫుడ్ కార్పొరేషన్ - ఎం.ఏ. ఫహీం,  సంగీత నాట్య అకాడెమీ - అలేఖ్య పుంజల,  తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ - కె. శివసేనా రెడ్డి,  వికలాంగుల కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ - ఎం. వీరయ్య,  విత్తనాల అభివృద్ధి సంస్థ - ఎస్. అన్వేష్ రెడ్డి, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ - కాసుల బాలరాజు,  కోఆపరేటివ్ యూనియన్ - మనాల మోహన్ రెడ్డి, ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ - జ్ఞానేశ్వర్ ముదిరాజ్,  రాష్ట్ర సహకార ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిదారుల ఛైర్మన్ - జంగా రాఘవరెడ్డి, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ - రాయల నాగేశ్వరరావు,  రాష్ట్ర మత్స్య సహకార సంఘం ఛైర్మన్ - మెట్టు సాయి కుమార్.