నిండా నాలుగు నెలలు లేవు... అప్పుడే నోబెల్ వరల్డ్ రికార్డు  సాధించిన తెలుగు చిన్నారి 

కొందరు చిన్నారులు ఏకసంతా గ్రహులు ఉంటారు.  నెలల వయసులో అద్భుతమైన గ్రాస్పింగ్‌ పవర్‌ ప్రదర్శిస్తారు. ఏదైనా ఒక్కసారి చెబితే ఇట్టే గ్రహించడమే కాకుండా దానిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం.. గుర్తించడం కూడా చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి చిన్నారులు చాలామంది గురించి నెట్టింట చూశాం. వారికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లాంటి వారు గుర్తించి సత్కరించారు కూడా. తాజాగా నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు  4నెలల చిన్నారి సాధించింది. 
జగిత్యాల జిల్లా  కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా వయసు నాలుగు నెలలు కూడా నిండలేదు. అప్పుడే  135 ప్లాష్ ఐడెండిటి కార్డులను గుర్తుపట్టింది. దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు చోటు సంపాదించుకుంది.కూరగాయలు, పక్షులు, జంతువులు, జాతీయ జెండాలు, దేశాలను సైతం గుర్తిస్తోంది.చిన్నారికి ఎంతో ప్రతిభ ఉందని కొనియాడారు. చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు సైతం చిన్నారికి ఆశీర్వదిస్తున్నారు