ప్రధానమంత్రితో భేటీ కానున్న సీఎం కె.సి.ఆర్...
posted on Oct 2, 2019 4:45PM

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఆయన దేశ రాజధానికి వెళ్లి, ఎల్లుండి మధ్యాహ్నం ప్రధాని మోదీ తో భేటీ అవుతారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ అవసరమైతే కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారు ఆ తరువాత రోజు ప్రధానమంత్రి మోడీతో భేటీ అవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అదే విధంగా యురేనియం తవ్వకాలు ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రధాని మోడీతో స్వయంగా కలిసి కె.సి.ఆర్ వివరించనున్నారు.
దీంతో పాటు పన్నులకు సంబంధించిన విషయంలో కొంత రిటిషన్ ఎఫెక్ట్ ఉంది. ఆ ఎఫెక్ట్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాలో కొంత కోత ఉంది. ఆ కోతను తగ్గించాలనో లేక రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పన్నుల విధింపు, లేదా పన్నుల వాటా కోత లాంటివి కేంద్రం చేయాల్సి ఉంటుంది. రాష్ర్టాలకిచ్చేటువంటి కేంద్ర వాటా విషయంలో ఈ పద్ధతులను పాటించాలంటూ దీనిపై మోడీతో మాట్లాడాలని కె.సి.ఆర్ అన్నారు.
దాంతో పాటు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తైంది, కాళేశ్వరం కు జాతీయ హోదా ఇవ్వాలంటే పాలమూరు ప్రాజెక్ట్ లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కోరారు. కాబట్టి పాలమూరు ప్రాజెక్టులలో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరేటువంటి అవకాశం కూడా ఉంది. జాతీయ రహదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వ్యతిరేకిస్తుంది ఎందుకంటే రాష్ట్రాలు యాభై శాతం భూ సేఖరణలు చెల్లించాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి అనేక జాతీయ రహదారులను అభివృద్ధి చేయడమో లేక కొత్త జాతీయ రహదారులను నిర్మించే విషయంలో ముఖ్యమంత్రి రేపు ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది.