ఆందోళన అవసరం లేదు సీఎం ఆరోగ్యం ఫై యశోద వైద్యులు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుఆరోగ్యంగా ఉన్నార‌ని, ఎవ‌రూ ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని య‌శోద ఆస్ప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ ఎంవీ రావు స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఏటా ఫిబ్ర‌వ‌రిలో సాధార‌ణ చెక‌ప్ చేస్తామ‌ని చెప్పారు. గ‌త రెండు రోజుల నుంచి బ‌ల‌హీనంగా ఉన్న‌ట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఎడ‌మ చేయి, ఎడ‌మ కాలు కొంచెం నొప్పిగా ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌కు సాధార‌ణ ప‌రీక్ష‌ల‌తో పాటు ప్రివెంటివ్ చెక‌ప్ కింద మ‌రికొన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని డాక్ట‌ర్ ఎంవీ రావు వెల్లడిచారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ ప‌రీక్ష‌లు చేశామ‌న్నారు. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని ఎంవీ రావు స్ప‌ష్టం చేశారు.

స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన సీఎం కేసీఆర్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో కలిసి శుక్ర‌వారం ఉద‌యం సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు గుండె, యాంజియో పరీక్షలు నిర్వహించినట్లుగా సీఎంవో వెల్లడించింది. అన్ని రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయి. రక్తనాళాల్లోనూ ఎలాంటి బ్లాక్స్‌ లేవని తేల్చారు. ఓవరల్‌గా గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు వైద్యులు.. చేయి నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకునేందుకు. ఎంఆర్ఐI స్పైన్‌లో చిన్న సమస్య వచ్చినట్లు గుర్తించారు..సర్వైకల్ స్పైన్‌లో కొంచెం తేడా ఉందని గుర్తించారు. అందువల్లే ఎడమచేయి నొప్పి వచ్చిందని చెప్పారు డాక్టర్లు. ఇది కూడా పెద్ద సమస్య కాదని వయస్సు రిత్యా వచ్చేందేనన్నారు.. అస్వస్థత కారణంగా నేటి యాదాద్రి పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు.

కేసీఆర్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, కుమారుడు కేటీఆర్, మ‌నుమ‌డు హిమాన్షు, కూతురు క‌విత‌, అల్లుడు అనిల్, మంత్రి హ‌రీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు ఉన్నారు.