బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ సీఐడీ నజర్.. ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు

బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సిఐడి ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహిస్తున్నది. బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసు కున్న తెలంగాణ సిఐడి తెలంగాణలో పాటు మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి ఎనిమిది మంది కీలక సూత్రధారు లను అరెస్టు చేశారు.

ఆరు యాప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ సిఐడి   ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కొరడా ఝళిపించాలని నిర్ణయించుకుంది.  అందుకే దేశంలో తొలిసారి ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ సీఐడీ బృందాలు రాజ స్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రా ల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు. ఆరు ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి  8 మందిని అరెస్టు చేశాయి. 

సిఐడి బృందాలు ఈ సందర్భంగా అనేక హార్డ్ వేర్  పరికరాలు,  స్తృతమైన డేటా  స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉండే అవకాశముందన్న అంచనాతో  వారిని గుర్తించే దిశగా  దర్యాప్తు సాగుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu