అఖిల భారత పిరికి సంఘం అధ్యక్షుడు జగన్!
posted on Mar 23, 2021 8:08PM
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభ వేదికగా కేంద్రమంత్రి ప్రకటనతో జగన్ సర్కార్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న జగన్... ఎందుకు మాట్లాడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాట తప్పం.. మడమ తిప్పమని చెప్పే జగన్... ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అఖిల భారత పిరికి సంఘానికి అధ్యక్షుడని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. హోదా కాదు కదా కేంద్రం నుంచి కప్పు కాఫీ కూడా జగన్‌రెడ్డి సాధించలేడని సైటైర్ వేశారు. గుంపుగా వైసీపీలో 22 మంది ఎంపీలు ఉండి ఏం లాభం? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చేసిందన్నారు. మెడలు వంచి హోదా సాధిస్తా అని తొడకొట్టిన జగన్‌రెడ్డి ఎక్కడ? అని నిలదీశారు. కనీసం నోరిప్పి అడిగే ధైర్యం కూడా లేదయ్యా జగన్‌రెడ్డీ నీకు?’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.