టీడీపీ-జనసేన శుభవార్త: లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!

తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘ప్రజాగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది. మిగతా విషయాన్నిటి గురించి తర్వాత ముచ్చటించుకుందాం.. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఒక ముఖ్యమైన శుభవార్త గురించి. ఆ శుభవార్త మరేదో కాదు.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు..

ప్రజాకంటక వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల రైతుల భూమి వాళ్ళ చేతిలో వుండదు.. ఎవరైనా అక్రమ మార్గాల ద్వారా స్వాధీనం చేసుకుంటే, రైతులు జీవితాంతం పోరాటం చేసినా ఫలితం వుండదు. అపురూపంగా దాచుకునే భూమి డాక్యుమెంట్లకు బదులు ఒక జిరాక్స్ కాగితం రైతు చేతికి వస్తుంది. మొత్తమ్మీద తరతరాలుగా వస్తున్న భూమి, కష్టపడి సంపాదించుకున్న సొంతం భూమి మీద అధికారం వుండదు.. ఆ అధికారమంతా ప్రభుత్వానికి, ధనబలం వున్నవారికి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకాల మీద తన ఫొటో పెట్టుకోవడం లాంటి తెంపరితనాన్ని ప్రదర్శించిన జగన్ ఈసారి రైతుల భూమికే ఎసరుపెట్టడానికే ఈ చట్టాన్ని తీసుకువచ్చాడు. ఈ చట్టం తాజాగా అమల్లోకి రావడంతో రైతులు, భూమి వున్నవారు వణికిపోతున్నారు. ఈ దరిద్రపు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన నుంచి వచ్చిన మేనిఫెస్టోలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  రద్దు’ అనే శుభవార్త చూసి ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.