కేసీఆర్ ఇప్పుడెందుకు పోల్చుకోవట్లేదు

 

తమ వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తూ కార్మికుల సంఘాలు వారం రోజులకు పైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందు అంత పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాలు కల్పించుకోని విమర్శించడంతో టీ సర్కార్ దిగొచ్చి వారి వేతనాలు పెంచుతామని చెప్పారు. దీంతో కార్మికల సంఘాలు కూడా సమ్మెను విరమించారు. అయితే వేతనాలు పెంచుతున్నామని చెప్పారు కాని అందుకు ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితి వల్ల అది సాధ్య కాదని.. ‘‘ప్రస్తుతం ఉన్న ఆదాయం మునిసిపాలిటీలను నిర్వహించడానికే చాలడం లేదని ఈ నేపథ్యంలో వారి వేతనాలు పెంచడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో సీఎం కేసీఆర్ ఇప్పుడు వేతనాల పెంపుపై ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

 

అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్మికుల జీతాల విషయంలో మాత్రం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని ఎద్దేవ చేశారు. ఇంతకు ముందు ప్రభుత్వా ఉద్యోగుల వేతనాలు పెంపుదల.. ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచినప్పుడు ఆంధ్రా ప్రభుత్వం కంటే ఒక శాతం ఎక్కవ పెంచి ఆంధ్ర రాష్టం కంటె మేం ఎక్కువ అని చూపించారు కేసీఆర్. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆంధ్రా మున్నిపల్ కార్మికులకు జీతాలు పెంచితే కేసీఆర్ ఎందుకు ఇంకా పెంచలేదని.. అన్ని విషయాల్లో ఏపీతో, చంద్రబాబుతో పోల్చుకునే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. దీనిలో భాగంగా వామపక్ష నేత తమ్మినేని వీరభద్రం స్పందించి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచకుంటే తాము 28, 29, 30 తేదీల్లో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.