25 మంది ఉగ్రవాదులు హతం...


సిరియా ఉగ్రవాదులపై రష్యా ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు వైమానిక దాడులు జరిపిన రష్యా కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులనుండి విముక్తి చేసింది. తాజాగా మరో దాడి జరపగా... సుమారు 25 మంది ఐఎస్ఐఎస్ జిహాదీ ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. సిరియాలోని ఉగ్రవాదులు ఇంకా ఉన్నారన్న సమాచారంతో..  రష్యా యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల సాయంతో కమెండో ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో 25 మంది  జిహాదీ ఉగ్రవాదులను హతమైనట్టు సమాచారం.  సంకీర్ణ సేనల సహకారంతో హోమ్స్‌ స్టేట్ లో సిరియా సైనికులు ఈ దాడులు నిర్వహించారు. వారికి సాయంగా రష్యా రంగంలోకి దిగింది. కాగా ఈ దాడుల సందర్భంగా జరిగిన ప్రతిదాడుల్లో ఆరుగురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.