పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు...

 

విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ పాకిస్థాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మూడేళ్లపాలనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాశ్మీర్ అంశంపై మాట్లాడుతూ...కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లే దమ్ము పాకిస్థాన్‌కు లేదని... ఆ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అన్నారు. దాయాది దేశంతో ఉన్న అన్ని సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని పేర్కొన్న సుష్మాస్వరాజ్ ఉగ్రవాదం, చర్చలు రెండూ కుదరని పని అని కుండబద్దలు గొట్టారు. చర్చలు కావాలంటే ఉగ్రవాదానికి పాక్ పుల్‌స్టాప్ పెట్టాల్సిందేనన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu