అంబానీ ఇంట్లో పుట్టాలనుకుంటున్నారా?
posted on Apr 13, 2024 2:02PM
సాధారణంగా ఇండియాలో చాలామంది ‘అంబానీ ఇంట్లో పుట్టినా బాగుండేది... సర్లే, ఈ జన్మలో ఎలాగూ పుట్టలేకపోయాం.. వచ్చే జన్మలో అయినా అంబానీ ఇంట్లో పుట్టేలా అనుగ్రహించు దేవుడా’ అనుకుంటారు. ఇలాంటి కోరిక కోరుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే, మీరు పొరపాటుగా ఇలా కోరుకున్నారంటే, వచ్చే జన్మలో చాలా ఇబ్బందులలో పడిపోతారు.
దేవుణ్ణి కోరుకునే కోరికలో క్లారిటీ లేకపోతే, వచ్చే జన్మలో మీ పని మటాష్ అయిపోతుంది. అంబానీ ఇంట్లో పుట్టించాలన్న మీ కోరిక దేవుడి చెవిలో పడి ఆయన పొరపాటుగా ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో కాకుండా అప్పుల కుప్పలా మారిన అనిల్ అంబానీ ఇంట్లో పుట్టించారంటే చచ్చారే! వచ్చే జన్మలో డబ్బుల సంగతి దేవుడెరుగు... అప్పుల ఊబిలో కూరుకుపోతారు. కాబట్టి... దేవుణ్ణి ‘అంబానీ ఇంట్లో పుట్టించు దేవుడా’ అని కాకుండా, కాస్తంత క్లారిటీగా ‘ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టించు దేవుడా’ కోరుకోవడం బెటర్.
ఇంతకీ ప్రస్తుతం అనిల్ అంబానీ పరిస్థితి ఏంటంటే, తన రియలన్స్ ఇన్‌ఫ్రా సంస్థకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ నుంచి 8 వేల కోట్ల రూపాయలు వస్తాయని అనిల్ అంబానీ గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ డబ్బు వస్తే తన ఆర్థిక కష్టాలు కొంతయినా తగ్గుతాయని భావించారు. గతంలో అనిల్ అంబానీకి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 8 వేల కోట్లు ఇవ్వాలని తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు తన తీర్పుని సమీక్షించకుంది.. అనిల్ అబానీకి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని లేటెస్ట్ గా తీర్పు చెప్పింది. దాంతో అంబానీ ఆశల సౌధం కూలిపోయింది. రావాల్సిన ఎనిమిది వేల కోట్లు రాకపోగా, ఆ ఎనిమిది వేలు రాలేదనే కారణంతో అనిల్ అంబానీ షేరు స్టాక్ మార్కెట్లో 20 శాతానికి పైగా పడిపోయి అంబానికీ డబుల్ షాక్ తగిలింది. అందువల్ల దేవుణ్ణి కోరుకునే కోరికను క్లారిటీగా కోరుకుందాం.