సర్వోన్నత న్యాయస్థానమే సంక్షిష్టం అన్న సమస్య

అసలు ఉచితం అంటే,సంక్షేమం అంటే  కనీసం అవి తీసుకుంటున్న ప్రజలకి తెలుసా?రాజకీయ పార్టీ లు తాము అధికారం లోకి రావడం కోసం ప్రజలని పథకాల పేరు తో ఉచితాలకి అలవాటు చేసారు. ఏది ఉచితమో.. ఏది సంక్షేమమో నిర్ణయించడం కష్ట సాధ్యమని సీజేఐ  జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిందంటేనే అర్ధం అవుతోంది రాజకీయ పార్టీ లు ఉచితాల ను ఎంతగా సంక్షిష్టం చేశాయో.  

అశ్వనీకుమార్ ఉపాధ్యాయ అనే  న్యాయవాది దాఖలు చేసిన ” ఉచితాల రద్దు ” పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు తాము అమలు చేస్తున్నవి ఉచితాలు కాదని,సంక్షేమ పథకాలని వాదించాయి. వాదనలు విన్న సుప్రీంకోర్టు హామీలు ఇవ్వకుండా నిరోధించలేమని స్పష్టం చేసింది. అలాగే ఏది ఉచితమో ఏది సంక్షేమమో నిర్దుష్టంగా నిర్వచించలే మనీ పేర్కొంది.

నిజానికి ఇలాంటి సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపిస్తుందేమో అనుకున్నారు. ప్రజల దగ్గర పన్నుల రూపం లో వసూలు చేసిన డబ్బును మళ్లీ వాళ్ళకే పథకాల రూపంలో ఇవ్వడం ప్రజలని సోమరిపోతుల్ని చేయడమే అని, ఉచితల వల్ల రాజకీయ పార్టీ లు అధికారం పొందుతాయోమో గాని దేశం లో అభివృద్ధి కుంటుబడుతుందని ప్రదాని మోడీ ఇటీవలే ఒక సందర్భంలో పేర్కొన్నారు.అయితే రాజకీయ పార్టీలు ఆ డబ్బులకు వివిధ పేర్లు పెట్టి ఆ వర్గాలు బాగుపడకూడదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఎవరూ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. తమ అధికారం కోసం ప్రజల జీవితాల్ని అంధకారం చేసి తాము వేల కోట్లు కూడబెట్టుకుంటే వచ్చే ప్రయోజనమేంటో ఆలోచించాలి.

ఈ విషయాన్నీ ప్రజలు కుడా ఆలోచించాలి. ఇచ్చే ఉచితపదకాలు తమ తర్వాతి తరాలు భవిష్యత్తు ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి.సుప్రీమ్ కోర్ట్ కూడా ఈ విషయం మీద తీర్పు చెప్పడానికి ఆలోచించింది అంటే ఉచితం అనే పదం ఎంత ప్రభావితం చేస్తోందో,రాజకీయ నాయకులూ దేశ అత్తున్నత న్యాయ స్థానాన్ని ఎంతప్రభావితం చేస్త్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.  దీన్ని  అంతం చేయాలంటే  పాలకులు రాజకీయ నేతల్లోనే మార్పు రావాలి అనుకుంటే కాదు.  ఉచిత పథకాల లబ్ధిదారుల్లోనూ మార్పు రావాలి.  ఉచితాల వల్ల నాశనం అయిన దేశాలని మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు,ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకుని జరగబోయే నష్టాన్ని ఆపాలి.దీనికి ఏ న్యాయ స్థానం అవసరం లేదు.ప్రజలలో మార్పు రావాలి.