పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన సుప్రీం
posted on Jan 31, 2025 2:01PM
.webp)
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలనూ విన్న సుప్రీం కోర్టు తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేచింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంత అని సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలంగాణ అసెంబ్లీ గడువు ముగిసే దాకా నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం రాదా అని నిలదీసింది.
ఈ దశలో ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ స్పీకర్ ను అడిగి చెబుతానని అన్నారు. దీంతో విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇలా ఉండగా పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులుఇప్పటి వరకూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. స్పీకర్ రీజనబుల్ టైం అన్నారనీ, దానికి నిర్దుష్ట టైమ్ ఫ్రేమ్ ఉండాలని వాదించారు.