పోలీస్ స్టేషన్లో సన్నీ లియోన్

 

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ బుధవారం మహారాష్ట్రలోని థానేలో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. సన్నీ లియోన్ మీద ఇటీవల అసభ్య సన్నివేశాలను ప్రచారం చేస్తున్నారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో వివరణ ఇవ్వడానికి, వాంగ్మూలం నమోదు చేయడానికి సన్నీ లియోన్ థానేలోని సైబర్ క్రైం సెల్‌కి హాజరై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.