పోసానికి సూళ్లూరు పేట పోలీసులు నోటీసులు

సినీ నటుడు , వైకాపా నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ పై విడుదలైన పోసాని   సోమవారం సిఐడి కార్యాలయానికి  వచ్చి సంతకం చేసే సమయంలో అనుకోని పరిణామం జరిగింది. సంతకం చేసి ఇంటికి వెళ్లిపోదామనుకున్న సమయంలో  పోసానికి షాక్ తగిలింది. ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని సూళ్లురు పేట  పోలీసులు నోటీసులిచ్చారు.ప్రస్తుతం కండిషన్ బెయిల్ పై విడుదలైన పోసానికి మరో మారు అరెస్ట్ భయం పట్టుకుంది. గత నెలలో గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.