గుండెలను పిండేస్తున్న విషాదం

ఆ క్షోభ వర్ణానాతీతం

చెమ్మగిల్లని కన్ను లేదన్నది నిజం

సుదీక్ష తల్లిదండ్రుల విలాపం

భగవంతుడా ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! ఎదిగిన బిడ్డ చదువుకుంటోంది,   మంచి భవిష్యత్తు ఉంటుందని, కలలు కన్నతల్లితండ్రులకు ... ఆ బిడ్డ విహారానికి వెళ్లి సముద్ర తీరం లో గల్లంతైయితే ,పది రోజులు గడుస్తున్నా పోలీసులు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెతికినా ఆచూకీ లేకపోతే ... తమ కుమార్తె బతికే ఉంది అన్న ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి లో... ఊరు కానీ ఊరిలో, సాగర తీరం లో వారు అనుభవిస్తున్న క్షోభ వర్ణనాతీతం. ఆ సాగర హోరులో వారి ఘోష కూడా కలిసిపోతోంది. చివరకు ఒడ్డున దొరికిన కొన్ని దుస్తులు తో ఇంకా ఆచూకీ లభించని స్థితి లో ఆ తల్లితండ్రులు తమ బిడ్డ బ్రతికే ఉండాలి అని కోరుకుంటూనే ... ఆమె మరణ ధ్రువీకరణ పత్రం కోసం పోలీసుల్ని అభ్యర్థిస్తున్నారు. 

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కోనంకి సుబ్బారాయుడు, శ్రీదేవి ల ఇరవై ఏళ్ళ పుత్రిక సుదీక్ష అమెరికా లోని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ లో చదువుకుంటోంది. స్ప్రింగ్ బ్రేక్ లో మార్చి 6న డోమెనికన్ రిపబ్లిక్ లో ని పంటకాన్ బీచ్ కు ఆమె స్నేహితురాళ్లతో కలిసి విహారానికి వెళ్లారు. ఆ రోజు మిత్రుని తో కలిసి బీచ్ లో ఈతకు వెళ్లిన ఆమె సముద్రపు అలల ధాటికి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆచూకీ చిక్కని ఆమె గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆమె తల్లిదండ్రులు చివరకు ఆశలు వదులుకున్నారు. పోలీసులు మాత్రం ఆమె తో ఆఖరి దశ లో కలిసి ఉన్న వ్యక్తి ని అదుపు లో కి తీసుకుని ప్రశ్నించారు. రోజులు గడుస్తున్నా పోలీసులు అతన్ని వదిలిపెట్టలేదు. సుదీక్ష తల్లిదండ్రులు ఆ వ్యక్తి మీద తమకు ఎలాంటి  ఎలాంటి అనుమానాలు లేవని తమ బిడ్డ చనిపోయిందని నమ్ముతున్నామని పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మరణ ధ్రువీకరణ పత్రం కోసం చేస్తున్న అభ్యర్ధన చూసేవారిని కంట తడి పెట్టిస్తోంది.