యుపిలో వింత...ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త
posted on Mar 28, 2025 1:11PM
ప్రాణభయం మనిషిని ఏ స్థాయికి అయినా దిగజారే స్థితికి తీసుకెళుతుంది. కట్టుకున్న భార్య ప్రియుడితే రాసలీలలు కొనసాగిస్తే ఏ భర్త అయినా సహించలేడు. అవకాశం దొరికితే ప్రియుడిని ముక్కలుముక్కలుగా నరికేసే రోజులివి. అయినప్పటికీ ఆ భర్త కట్టుకున్నతన భార్యను ప్రియుడికిచ్చి వివాహం చేశాడు. ఉత్తర ప్రదేశ్ కబీర్ నగర్ జిల్లాలో రాధిక అనే యువతితో బబ్లూకి 2017లో పెద్దల సమక్షంలో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. రాధికకు అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతరసంబంధం ఏర్పడింది. భర్త బబ్లుకు ఈ విషయం తెలియడంతో భార్యతో తరచూ గొడవపడేవాడు. అయినా భార్య రాధిక తన ప్రవర్తన మార్చుకోలేదు. ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. చాటు మాటుగా కాకుండా ఇరుగుపొరుగు వారికి తెలిసేలా కొనసాగించింది. గత వారం మీరట్ లో ముస్కాన్ అనే యువతి ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయంచి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో వేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనమైన ఈ దారుణహత్య తో రాధిక భర్త బబ్లూలో ఎవరూ ఊహించని మార్పు వచ్చింది. బబ్లూకు కూడా ప్రాణ భయం పట్టుకుంది. తన ప్రాణాలను రక్షించుకోవాలని డిసైడయ్యాడు. రాధిక తన ప్రియుడితో హత్య చేయిస్తుందేమోనని వణికి పోయాడు. నీ ప్రియుడితో పెళ్లి జరిపిస్తాను అని భార్య రాధికను అడిగాడు భర్త బబ్లూ. పెళ్లికి భార్య ఒప్పుకోవడంతో గుడిలో సాంప్రదాయంగా పెళ్లి తంతు జరిపించాడు. మీరట్ ఘటన తర్వాత తన శరీరంలో రక్తం సలసలా కాగుతున్నప్పటికీ భర్త బబ్లూ భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేయడం చర్చనీయాంశమైంది. ఈ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.