రాత్రి పడుకునేముందు ఈ పొరపాట్లు చేస్తే జోంబీలుగా మారిపోతారట!
posted on Sep 16, 2023 9:30AM
జాంబీ అనే పదం సినిమాలలో వినే ఉంటారు. కేవలం సినిమాలలో వినడమే కాదు, జాంబీలు ఎలా ఉంటారో కూడా చూసి ఉంటారు. కళ్లు బాగా ఉబ్బిపోయి, కళ్లకింద నల్లటి వలయాలు, మచ్చలు ఉంటాయి. వారి నడక నుండి ప్రవర్తన వరకు అంతా భయంకరంగా ఉంటుంది. నిజానికి రాత్రి పడుకునే ముందు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల సాధారణ మనుషులు కూడా ఇలా జోంబీలుగా మారిపోతారట. అసలు రాత్రి పడుకునే ముందు చాలామంది చేస్తున్న తప్పేంటి? దీనివల్ల అంత పెద్ద ప్రమాదం ఎందుకు కలుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..
చాలామంది రాత్రి సమయంలో ఆహారం తీసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు భోజనం చేస్తే.. మరికొందరు అలా తినగానే ఇలా నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా అధిక బరువుకు కారణం అవుతుంది. మరికొంతమంది ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్న కారణంగా రాత్రి సమయంలో పడుకోవడానికి ముందు ఆహారం ఆలస్యమైతే ఇక రాత్రి భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకమరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి సమయంలో తినగానే నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో.. అస్సలు తినకుండా ఖాళీ కడుపుతో నిద్రపోవడం కూడా అంతే ప్రమాదం. పైపెచ్చు రాత్రి సమయంలో ఆహారం ఎగ్గొట్టడం వల్ల శరీరంలో విటమిన్-బి12, విటమిన్-డి, కాల్షియం, ప్రోటీన్ మొదలైనవి లోపిస్తాయి. వీటి లోపం కారణంగా శరీరం చాలా నష్టపోతుంది.
కొన్ని అనుకోని పరిస్థితులలో ఖాళీ కడుపుతో నిద్రపోవడం ఎప్పుడో ఒకసారి జరిగితే అదేమీ అంత ప్రమాదం చూపించదు. కానీ ఇది ప్రతిరోజూ అలవాటు అయితే మాత్రం క్రమంగా శరీరం జోంబీలాగా మార్పు చెందుతుందట. కడుపుకు సరైన ఆహారం లేకపోతే రాత్రి సమయంలో నిద్రపట్టడం కూడా కష్టమే. మరొక విషయం ఏమిటంటే రాత్రి సమయంలో ఆహారం తీసుకోకపోతే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుప్రమాదం ఉంటుందట. అందుకే ప్రతి ఒక్కరూ రాత్రి పడుకోవడానికి కనీసం రెండు నుండి 3 గంటలలోపు ఆహారం తీసుకోవడం ముగించాలని చెబుతున్నారు. దీనివల్ల పడుకునే సమయానికి ఆహారం దాదాపుగా జీర్ణమై జీర్ణాశయం కూడా విశ్రాంతి దశలోకి వెళుతుంది. ఇవన్నీ జరగటం వల్ల జోంబీలుగా మారటం ఏంటి పిచ్చికాకపోతే అని చాలామందికి అనుమానం వస్తుంది. కానీ ఇవన్నీ ధీర్ఘకాలం కొనసాగితే ఎదురయ్యే పరిస్థితి మాత్రం అదే అని పరిశోధకులు చెబుతున్నారు.
*నిశ్శబ్ద.