సభా సంఘాల నియామకం చేసిన స్పీకర్

 

శాసన సభలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను అంశాల వారిగా చర్చించి, వాటిపై తమ సలహాలు, సూచనలు మరియు సవరణలను తెలిపేందుకు ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ 12 సభా సంఘాల చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సభా సంఘాలు మే 2వ తేదీలోగా తమ నివేదికలను స్పీకర్ కి అందజేయవలసి ఉంటుంది.

మౌళిక వసతులు, అభివృద్ధి సంఘానికి మాత్రం ఇద్దరు చైర్మన్లను నియమించారు. వారు:

మౌళిక వసతులు, అభివృద్ధి-ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరావు మరియు ఎమ్మెల్సీ నరసారెడ్డి (తెదేపా)

ఉపాధి కల్పన - ఎమ్మెల్యే మస్తాన్‌రావు(తెదేపా)

మానవ వనరులు- ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు

పట్టణాభివృద్ధి -ఎమ్మెల్యే విజయప్రసాద్‌ (కాంగ్రెస్)

గ్రామీణాభివృద్ధి- ఎమ్మెల్సీ యాదవరెడ్డి (కాంగ్రెస్)

రెవిన్యూ - ఎమ్మెల్యే జీవీ శేషు (కాంగ్రెస్)

వ్యవసాయం- ఎమ్మెల్యే సుధాకర్‌ (కాంగ్రెస్)

సంక్షేమ కమిటీ- ఆత్రం సక్కు

ఆరోగ్యం - ఎమ్మెల్యే వంగాగీత (కాంగ్రెస్)

అడవులు, పర్యావరణం- ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి (కాంగ్రెస్)

నీటిపారుదల - ఎమ్మెల్యే కిష్టారెడ్డి (కాంగ్రెస్)