పాలిగ్రాఫ్ టెస్ట్ కు ఎస్పీ సిల్వీందర్ సింగ్..?
posted on Jan 8, 2016 3:27PM

పంజాబ్ పఠాన్ కోట్ కేసులో ఎస్పీ సిల్విందర్ సింగ్ ను ఎన్ఐఏ విచారిస్తూనే ఉంది. ఇప్పటికే సల్విందర్ చెప్పిన సమాధానాల్లో ఎన్నో అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష చేయాలని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) నిర్ణయించింది. సల్వీందర్ సింగ్ ను ఢిల్లికి కాని, బెంగళూరుకు కాని తీసుకుని వెళ్లి పాలిగ్రాఫ్ పరీక్ష చేయించాలని నిర్ణయించినట్లు ఎన్‌ఐఎ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు సల్వీందర్ ఉపయోగించిన ప్రయివేటు వాహనంపై నీలి రంగు దీపం అమర్చారు. దీనిపై కూడా ఎన్‌ఐఎ విచారణ జరుపుతోంది. ఈ కారును ఉపయోగించిన ఉగ్రవాదులు కారుపై అమర్చిన నీలి దీపం కారణంగానే పోలీస్ చెక్‌పోస్టుల వద్దనుంచి సులభంగా తప్పించుకుని ముందుకు వెళ్లగలిగారని తెలుపుతున్నారు. అయితే పాలిగ్రాఫ్ పరీక్షకు సల్వీందర్ అంగీకరించారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.