బవుమా ది గ్రేట్.. పొట్టోడే కానీ గట్టోడు
posted on Jun 15, 2025 3:38PM

ODI వరల్డ్ కప్ - 1999 సెమిఫైనల్, ఐసీసీ నా్కౌట్ ట్రోఫీ -2000 సెమీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ - 2002 సెమీ ఫైనల్, ODI వరల్డ్ కప్ -2007 సెమీ ఫైనల్, T20 వరల్డ్ కప్ - 2009 సెమీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ - 2013 సెమీ ఫైనల్, T20 వరల్డ్ కప్ - 2014 సెమీ ఫైనల్, ODI వరల్డ్ కప్ - 2015 సెమీ ఫైనల్, ODI వరల్డ్ కప్ - 2023 సెమీ ఫైనల్, T20 వరల్డ్ కప్ - 2024 ఫైనల్, ఎన్నో ఓటములు ఎన్నో అవమానాలు... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ - 2025 ఫైనల్ విన్నర్.మొత్తం గా 27 సుధీర్ఘ నిరీక్షణ తరువాత సౌతాఫ్రికా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది.
వన్ విన్ ఎనఫ్- టు క్రియేట్ బెటర్ బజ్ ఇన్ ఫ్యూచర్ అంటారు. ఈ ఒక్క విజయం కోసం ఎన్నో ఏళ్ల నిరీక్షణ అవసరమైంది దక్షిణాఫ్రికాకు. ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికాకు ఎందరో కెప్టెన్లుగా పని చేశారు. హేమా హేమీలు.. హాన్సీ క్రోనే, గారీ కిరిస్టన్, షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రీమీ స్మిత్, జాక్ కల్లీస్, యాష్వెల్ ప్రిన్స్, హషీం ఆమ్లా, ఏబీ డీవిలియర్స్, ఫాఫ్ డుప్లిస్, డీన్ ఎల్గర్, క్వింటన్ డికాక్ ఇందరు సారధ్యం వహించినా సాధ్యం కానిది బవుమా.. ఒక్కడు ఇన్నేసి పరాజయాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టాడు.
దక్షిణాఫ్రికా క్రికెట్ ఒక సమయంలో క్రికెట్ నుంచి తప్పుకుంది. తర్వాత 1993లో హాన్సీ క్రానే కెప్టెన్సీలో తిరిగి క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఎప్పుడైతే 1999 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడ్డం మొదలైందో.. ఆ పరంపర నిన్న మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ వరకూ ఒకటే ఓటములు.
అన్నీ ఉన్నాయి- అల్లుడి నోట్లో శని.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒక ఇంగ్లండ్, మరో ఆస్ట్రేలియాకు ధీటుగా స్క్వాడ్ ఉండేది. వారిలో మెరికల్లాంటి క్రికెట్ వీరులుండేవారు. కానీ ఎందుకనో ఎక్కడో దురదృష్టం వెనక్కు లాగేసేది. ఎట్టకేలకు బవుమా సుడి బాగున్నట్టుంది. అందుకే ఒక్కటంటే ఒక్క ఛాంపియన్ షిప్ లో జట్టును ముందుండి నడిపించి విజయం సాధించాడు.. ఇప్పుడిదిగో.. ఒక టెస్టు గదను తన దేశానికి తీస్కెళ్తున్నాడు. మా పొలంలోనూ మొలకలొచ్చాయ్ అంటూ ఎంతో సంబరంగా కాలరెగేస్తున్నాడు.
విజయం అన్నది ఒక్కోసారి వేయి కళ్లతో ఎదురు చూసేలా చేస్తుంది అదంతా. ఒక్కొక్కరికి ఒక్కో డ్రీమ్ అలాగే మిగిలిపోతుంది. అలాగని ఇదేం అంత తేలికైనది కాదు. టెస్ట్ ఛాంపియన్ షిప్. క్రికెట్ పుట్టిందే టెస్టుల్లో. అది కూడా లార్డ్స్ లో. అలాంటి గడ్డ మీద ఇలాంటి ఆటలో చాంపియన్ గా అవతరించడం అంటే.. ఈ జట్టులో అంతటి సంప్రదాయపు క్రికెట్ ఆడే ఆటగాళ్లు అంత పుష్కలంగా ఉన్నారన్న సంకేతాలను ఇస్తుంది.
ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మామూలు లక్కీఫెలో కాడు. ఈ మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ అవలీలగా ఎగరేసుకుపోయినంత లక్కీ. అలాంటి లక్కీ టీమ్ కమ్ కెప్టెన్ ముందు దక్షిణాఫ్రికా ఆటలు సాగుతాయా? అన్నది అందరికీ అనుమానమే. కానీ ఏ అదృష్ట దేవత వీరిపై చల్లని చూపు చూసిందో తెలీదు కానీ ఏకంగా 27 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ఇదిగో తొలి ఐసీసీ విజయాన్ని వారి ఖాతాలో వేసింది. ఎనీ హౌ కంగ్రాట్స్ దక్షిణాఫ్రికా. వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ.. అన్నది సగటు క్రికెట్ లవర్ కామెంట్ గా తెలుస్తోంది.