రెండేళ్లలో రాజధాని పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ

 

మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన వైసీపీ అధినేత జగన్.. అధికారంలోకి రాగానే  మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరలైపోయారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ.. దానిపై దుష్ప్రచారానికి దిగుతుందన్నారు. 

అల్లిపురం డంపింగ్ యార్డ్ లో లెగిసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించిన నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందని.. 50% చెత్తను రీసైక్లింగ్ చేశామని మంత్రి వెల్లడించారు. అక్టోబర్ రెండు నాటికి ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని   వివరించారు. మహిళలంటే వైసీపీకి గౌరవం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళను వేశలంటూ కించపరిచారని  మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని 50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు