దాసరి మృతిపై సోనియాగాంధీ...
posted on May 31, 2017 11:43AM
.jpg)
దర్శకరత్న దాసరినారాయణరావు నిన్న మరణించిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన నిన్న మృతి చెందారు. దీంతో దాసరి మరణవార్త తెలిసిన తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది. పలువురు నటీ నటులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక అనేకమంది దాసరి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా దాసరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో ఆయన ట్రెండ్ సెట్టర్ అని, సామాజిక అంతరాలు తొలగించేవిధంగా సినిమాలు తీశారని కొనియాడారు. దాసరి నారాయణరావు నిబద్ధత కలిగిన సామాజిక రాజకీయ కార్యకర్త సోనియా గాంధీ పేర్కొన్నారు. కాగా యూపీఏ హాయంలో దాసరి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. సోనియాగాంధీకి దాసరి సన్నిహితుడు కూడా.