ఫోన్ ట్యాపింగ్ కేసు.. కీలక వ్యక్తులకు సిట్ నోటీసులు

తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కుమారుడు సందీప్‌కు సిట్ అధికారులు నోటీసులు అందజేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోసం వీరిని విచారించ నున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వారు బుధవారం (జనవరి 7) హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు, రాజకీయ నేతలు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారం సాగిందన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా జారీ చేసిన నోటీసులతో కేసు కీలక దశకు చేరినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu