సింహాచలం దుర్ఘటనలో ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
posted on May 5, 2025 9:56PM

విశాఖ సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై యాక్షన్ తీసుకుంది. విచారణ కమీటీ నివేదిక మేరకు. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఆలయ ఈవో కె. సుబ్బారావు, ఆలయం ఈఈ శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈలు కె.ఎస్.ఎన్. మూర్తి, స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి.మదన్, ఆలయం జేఈ కె.బాబ్జీలపై సస్పెన్షన్ వేటు వేసింది. గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధరించింది.