సైలెన్స్!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో  గత నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.హైదరాబాద్‌, తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ స్వస్థలాలకు లక్షలాదిగా వస్తున్నారు. 

ఇక ఎన్నికల కమిషన్ పోలింగ్ ముగిసే వరకూ రాష్ట్రంలోని  పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందనీ,  ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించింది. ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు అంటే మే 13 సాయంత్రం 6 గంటల వరకు  వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు.   పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరగకుండా పోలీసుల నిఘా ఉంటుంది.

 ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుంది. అలాగే మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం కూడా నిషేధం. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా  విధించే అవకాశం ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu