మాధవీలత ఫిర్యాదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ లో కేసు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి తనను కించపరచారంటూ సినీ నటి మాధవి లత చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  రాజకీయ నాయకురాలిగా మారిన సినీ నటి మాధవీలత బీజేపీలో ఉన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జేసీ ప్రభాకరరెడ్డి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం నేపథ్యంలో మాధవీలత, జేపీ ప్రభాకరరెడ్డిలపై మాటల యుద్ధం నడిచింది. ఆ సందర్భంగా జేపీ ప్రభాకరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

తాడిపత్రిలో మహిళల కోసం న్యూ ఇయర్ రోజున జేసీ పార్క్ లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, జేసీ పార్క్ కు మహిళలు వెళ్లొద్దని, అక్కడి అరాచక శక్తుల వల్ల మహిళలకు అపాయం కలిగొచ్చని మాధవీలత వ్యాఖ్యానించారు. దాంతో జేసీ భగ్గుమన్నారు. మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో జేపీ ఆ తరువాత క్షమాపణ కూడా చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News