నిలిచిపోయిన అమరావతి పనులు.. కారణమేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు నిలిచిపోయాయి. టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ముందుగా నిర్ణయించిన మేరకు అమరావతి పనులకు టెండర్లు పిలవాల్సి ఉన్నా, సీఆర్డీయే అధికారులు దానికి బ్రేక్ వేశారు. 

అయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు ఈఆ ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మాత్రమే అమరావతి పనులకు టెండర్లు పిలిచి, పనులను పరుగులెత్తించాలని అధికారులు నిర్ణియించారు. ఎన్నికల కోడ్ కు అమరావతి పనులకు సంబంధం లేదని చెబుతూ వచ్చిన అధికారులు,  ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నుంచి క్లారిటీ తీసుకుందామని కూడా ఒక దశలో భావించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పనులను చేపట్టడం సరికాదని భావించిన ప్రభుత్వం కోడ్ ముగిసిన తరువాతే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియను సీఆర్డీఏ నిలిపివేసింది.   

రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి. టెండర్లను ఆహ్వానించి వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది.  ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సరిగ్గా ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.  దీంతో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ పనులను నిలిపివేయాలనీ, టెండర్ల ప్రక్రియను కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తరువాతనే ఆరంభించాలని నిర్ణయించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu