శ్రుతి హాసన్ "బలుపు"
posted on Sep 24, 2012 5:21PM

శ్రుతి హాసన్ బలుపుతో బిజీగా ఉంది .... అందుకే చెర్రీ కొత్త సినిమాలో ఒక ఐటమ సాంగ్ చేయమని నిర్మాత ఆఫర్ యిస్తే బ్లంట్ గా నో చెప్పేసిందట. ఇంతకుముందు బన్నీ సినిమాకి కూడా స్పెషల్ సాంగ్ చేయమని ఆఫర్ వచ్చినప్పుడు కూడా శృతి తిరస్కరించిందట. టాప్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయిన చేర్రీని కాదని రవితేజ 'బలుపు' ని నమ్ముకోవడం దేనికని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గబ్బర్ సింగ్ తో టాలీవుడ్ కి బాగా దగ్గరైనా శృతి మెగా ఫ్యామిలీ హీరోలకు నో చెప్పడం ఏమిటని ఆవెశాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రభుదేవా డైరెక్షన్ లో మరో కొత్త తెలుగు సినిమా చేస్తున్నానని చెప్పుకుంటున్న శృతికి బాబాయ్ 'పవర్' ని రుచి చూసేసరికి అబ్బాయి ఆనడం లేదా ఏంటీ అని కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఆరు నూరైనా సరే ఐటమ సాంగ్ కి ఎస్ అనేది లేదని శృతి గట్టిగానే చెబుతోంది. ఈ వార్ ఇంకా ఎంతదూరం పోతుందోనని అటు మెగా ఫ్యాన్స్ ఇటు శృతి అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది.