నంద్యాల వైసీపీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి

భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సాంప్రదాయం ప్రకారం భూమా కుటుంబానికే చెందిన బ్రహ్మానందరెడ్డిని  టీడీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారా అని అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూశారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న శిల్పామోహన్ రెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరడంతో అక్కడ పంచాయతీ మొదలైంది. ఉపఎన్నికకు అభ్యర్ధిగా తమను ప్రకటించాలంటూ చాలా మంది జగన్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో శిల్పా చేరిక ఫ్యాన్‌ను కలవరపెట్టింది. దీనిపై అనేక తర్జన భర్జనల అనంతరం శిల్పామోహన్ రెడ్డినే పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తూ జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెర పడినట్లైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu