విశాఖలో కామ్రేడ్ నారాయణకు "కాలు" బెణికింది

నిత్యం పోరాటాలు..నిరసనలతో హోరెత్తించే కామ్రేడ్ నారాయణకు విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో భూకుంభకోణం వెలుగు చూడటం..ఇంకా ఎంతో భూమి కబ్జాకోరల్లో ఉండటంతో దీనిపై నిరసన తెలిపేందుకు నారాయణ విశాఖ వచ్చారు. దీనిలో భాగంగా మధురవాడకు దగ్గర్లోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడంతో దానిని పరిశీలించేందుకు కార్యకర్తలతో కలసి వెళ్లాను నారాయణ..అయితే ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఉండటంతో కోపంతో దానిని అదేపనిగా కొట్టారు నారాయణ. ఈ క్రమంలో రెండు సిమెంట్ పలకల మధ్య నారాయణ కాలు ఇరుక్కుపోయింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కార్యకర్తలు వెంటనే స్పందించి..కామ్రేడ్ కాలును బయటకు తీశారు. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu