షరపోవా ఆట ఇక చూడలేం

రష్యా టెన్నిస్ స్టార్, అందాల మరియా షరపోవా కోర్టులో ఆడుతుంటే చూడాలని ఎవరికి  ఉండదు..కేవలం ఆమె అందాన్ని చూడటానికే స్టేడియానికి వెళ్లేవారు ఉన్నారు. అలాంటి వారందరికి ఒక షాకింగ్ న్యూస్. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి 15 నెలల నిషేధం పూర్తి చేసుకున్న షరపోవా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఫ్రెంచ్ ఓపెన్‌లో తిరిగి టెన్నిస్ ఆడుతుందని ఆమె అభిమానులు ఆశించారు. అయితే డోపింగ్‌తో టెన్నిస్ ఆట పరువు తీసిన షరపోవాపై జీవిత కాల నిషేదం విధించాలని టెన్నిస్ అభిమానులు, క్రీడాకారులు చేసిన విజ్ఞప్తిని ప్రపంచ టెన్నిస్ సమాఖ్య ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. షరపోవా టోర్నీలో ఆడేందుకు అనుమతి లేదని..టోర్నీ ఆడేందుకు సరిపడా ర్యాంకింగ్ పాయింట్లు కూడా ఆమెకు లేవని అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదని తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 28 నుంచి ప్రారంభంకానున్న ఫ్రెంచ్ ఓపెన్‌కు మరియా షరపోవా దూరమైనట్లే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu