"సీతమ్మ వాకిట్లో..."ఈ ఆనందం ప్రత్యేకం..!
posted on Jan 13, 2013 12:23PM
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మొదటి ఆట పూర్తికాగానే మీడియా మిత్రులంతా అభినందిచడంతో నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని దిల్ రాజు చెప్పారు. ఉదయం అలాగే చాలా మంది ఫోన్లు చేసి ఒక అద్భుతమైన, అందమైన తెలుగు సినిమా తీశారని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను ఎలా ఆదరిస్తారోనని భయపడ్డాను. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు ఫోన్ చేసి మేమందరం మరిచిపోయిన లైన్‌ని నువ్వు సినిమాగా తీశావ్, దర్శకుడికి, నీకు హ్యాట్సాఫ్ అని చెప్పడం, మంత్రి శ్రీధర్‌బాబు ఫోన్ చేసి చాలా కాలం తరువాత ఓ మంచి సినిమా చూశాను, ఈ సినిమా డివిడి రాగానే నాకే ముందు పంపించు, ప్రతి రోజు చూడాల్సిన చిత్రమిదని అన్నారు. ఇద్దరి హీరోల అభిమానులు కూడా మాకు హీరోలు కనిపించలేదు, వాళ్ళ క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయని చెప్పడం మరింత ఆనందాన్నిచ్చింది. మా బ్యానర్లో ఇన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమాకు లభించిన ఆనందం ఇంతకు ముందు లభించలేదు” అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.