విమానం కోసం తీవ్రంగా గాలింపు...

 

ఇండోనేసియా నుంచి సింగపూర్‌కి వెళ్తూ ఆదివారం ఉదయం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం అదృశ్యమై 24 గంటలు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో విమానంలోని ప్రయాణికుల బంధువులలో ఆందోళన నెలకొంది. విమానంలో 155 మంది ప్రయాణికులు, 7గురు సిబ్బంది వున్నారు. ఇండోనేసియా, మలేసియా, సింగపూర్‌, ఆస్ట్రేలియా దేశాలు వైమానిక, నావికా దళాలతో గాలింపు చేపడుతున్నారు. విమానం సముద్రంలో కూలిపోయి వుంటుందని రెస్క్యూ అధికారులు అంటున్నారు. సముద్రం అడుగున సబ్ మెరైన్‌తో గాలింపు జరిపితే ప్రయోజనం వుండొచ్చని వారు భావిస్తున్నారు.